‘గ్యాంగ్ లీడర్’ ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటేల్స్ !

నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’గా మారిన సంగతి తెలిసిందే. మెగా యంగ్ హీరోలకి దక్కని అవకాశం నానికి దక్కింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇదో రివెంజ్ స్టోరీ. కామెడీ యాంగిల్ లో సాగే రివేంజ్ స్టోరీ. ప్రేక్షకులని ఫుల్లుగా నవ్విస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే రిలీజైన గ్యాంగ్ లీడర్ టీజర్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయ్. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా రూ. 28.20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది.

ఏరియాలవారీగా చూస్తే.. నైజాం రూ.8.00 కోట్లు, సీడెడ్ రూ.3.60 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.2.50 కోట్లు, గుంటూరు రూ.1.80 కోట్లు, ఈస్ట్ గోదావారి రూ.1.60 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.1.20 కోట్లు, కృష్ణా రూ.1.45 కోట్లు, నెల్లూరు రూ.0.75 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 20.90 కోట్ల బిజినెస్ జరిగింది. రెస్ట్ ఆఫ్ ది ఇండియా రూ.1.80 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5.50 కోట్ల బిజినెస్ చేసింది. 

మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.28.20 కోట్ల బిజినెస్ జరుపుకొంది గ్యాంగ్ లీడర్. ‘సాహో’ సందడి ముగిసిన తర్వాత వస్తున్న చిత్రమిది. ఈ సినిమా వచ్చిన వారం తర్వాత వరుణ్ తేజ్ వాల్మీకి రానుంది. అక్టోబర్ 2న సైరా వచ్చే వరకు ఈ రెండు సినిమాలు హవా నడవనుంది.