‘ఆర్డీఎక్స్ లవ్’ ట్రైలర్.. చాలా చప్పగా ! 


‘ఆర్డీఎక్స్ లవ్’ టీజర్ దాదాపు పోర్న్ సినిమాని తలపించింది. బూతు డైలాగ్స్, లిప్ కిస్ సీన్స్ విచ్చలవిడిగా పడ్డాయి. అలాంటి సినిమా నుంచి వస్తున్న ట్రైలర్ మరింత ఘాటుగా ఉంటుందని భావించారు. కానీ అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది ట్రైలర్. చాలా చప్పగా ఉంది. యాక్షన్ హైలైట్ గా ట్రైలర్ ని కట్ చేశారు. ఇదొక ఫక్తు లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమా అనే విషయం ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. టీజర్ తో కుర్రకారుని ఆకట్టుకొనే ప్రయత్నం చేయగా.. ట్రైలర్ తో మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేశారు.