రాజ్ తరుణ్ టైటిల్ ‘ఒరేయ్.. బుజ్జిగా’ !

కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాలవిక నాయక్ కథానాయిక. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కె కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేశారు. ‘ఓరేయ్.. బుజ్జిగా’ పేరు పెట్టారు. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. 

‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా తర్వాత దర్శకుడు కొండా విజయ్ కుమార్ కి మరో హిట్ దక్కలేదు. ఇటీవల ఆయన మళ్లీ నితిన్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేసినా.. కుదరలేదు. దీంతో ఆయన రాజ్ తరుణ్ హీరోగా ఓరేయ్.. బుజ్జిగా సినిమాని తీసుకొస్తున్నారు. జెడ్ స్వీడుతో షూటింగ్ పూర్తి చేసి.. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.