హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

తెలంగాణ భాజాపా సీనియర్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఆయన్ని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు. బుధవారం దత్తన్న హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయనచే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, జితెందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. గత మోడీ ప్రభుత్వం హయాంలో దత్తన్న కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన్ని కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించడం.. లోక్ సభ ఎన్నికల్లో ఆయనకి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంపై విమర్శలొచ్చాయ్. ఐతే, ఇప్పుడు దత్తన్నని గవర్నర్ గా పంపి ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకొంది భాజాపా అధిష్టానం. గవర్నర్ అయ్యాక దత్తన్న అలాయ్ భలాయ్ మరుస్తాడేమో చూడాలి. ప్రతి దసరా పండగకి పార్టీలకి అతీతంగా దత్తన్న అలాయ్ బలాయ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.