మండలి చైర్మన్‌గా గుత్తా ఏకగ్రీవం


తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ మండలి సమావేశాలు ప్రారంభం కాగానే గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం ఛైర్మన్ గా గుత్తా బాధ్యతలు స్వీకరించారు. గుత్తాను ఛైర్మన్ స్థానం వద్దకు మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, మండలి సభ్యులు తోడ్కొని వెళ్లారు. అనంతరం సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు గుత్తాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు.

వార్డు నెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన అనుభవం గుత్తాకి ఉంది. ఆయనకి పంచాయతీ, సహకార, పార్లమెంటరీ విధానాలపై అనుభవం ఉంది. గుత్తా ఆజానుభావుడు, ఆయన కుర్చుంటే చైర్మన్ కుర్చీకే అందం వచ్చిందన్నారు మంత్రి హరీష్ రావు. మంత్రులు, అధికార, ప్రతిపక్ష సభ్యులు ఈ సందర్భంగా గుతాకి ఉన్న రాజకీయ అనుభవం, ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. మండలిలో అర్థవంతమైన చర్చ జరిగేందుకు కృషి చేయాలని కోరారు.