‘గ్యాంగ్ లీడర్’ నానికి రాసిపెట్టి ఉంది !


మెగా యంగ్ హీరోలంతా ‘గ్యాంగ్ లీడర్’గా మారుదామని ప్రయత్నించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్..
ఇలా మెగా యంగ్ హీరోల పేర్లన్నీ గ్యాంగ్ లీడర్ సీక్వెల్ కోసం వినిపించాయి. కానీ కుదరలేదు. ఈలోగా నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ అయిపోయాడు. అది మెగా అభిమానులకి నచ్చలేదు. గ్యాంగ్ లీడర్ అయ్యే అర్హత మెగా హీరోలకి మాత్రమే ఉందని కామెంట్స్ చేశారు. ఐతే, కథ డిమాండ్ మేరకే ఆ టైటిల్ పెట్టామని నాని వివరణ ఇచ్చారు కూడా. ఏదేమైనా గ్యాంగ్ లీడర్ నానికి రాసిపెట్టి ఉంది. ఇదే విషయాన్ని గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ వేడుకలో నాని ప్రస్తావించారు.

‘మనం’ సినిమా తర్వాత నుంచి విక్రమ్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా. ఆయన చాలా కథలు చెప్పారు. కానీ నాకు నచ్చలేదు. బహుశా.. మా ఇద్దరికీ గ్యాంగ్ లీడర్ రాసిపెట్టినట్టుంది. ఇక మైత్రీ మూవీస్ లోనూ సినిమా చేయాలని చాన్నాళ్ల నుంచి అనుకొంటున్నా.
ఇన్నాళ్లకి కుదిరింది. విక్రమ్, మైత్రీ, తనకి గ్యాంగ్ లీడర్ సినిమా రాసిపెట్టినట్టుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అన్నారు నాని. సెప్టెంబర్ 13 నుంచి విశాఖలో గ్యాంగ్ లీడర్ టికెట్ ముక్క కూడా దొరకకూడదు. ఆ బాధ్యత అభిమానులదే అన్నారు నాని. ఈ సందర్భంగా సినిమా కోసం పనిచేసిన వారందరీకి నాని కృతజ్ఝతలు తెలిపారు.