గుడ్ న్యూస్ : ఐఫోన్ ధరలు తగ్గాయోచ్.. !

యాపిల్‌ సంస్థ మంగళవారం ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రోమ్యాక్స్‌ ఫోన్లను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో పాత ఐఫోన్‌ మోడళ్ల ధరలు తగ్గించింది. గతేడాది విడుదల చేసిన ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఎక్స్‌ఎస్‌ సహా ఇతర మోడళ్ల ధరలను యాపిల్‌ సంస్థ భారత్‌లో తగ్గాయి. రూ.76,900 గా ఉన్న ఐఫోన్ ఎక్స్ ఆర్ ధర.. ఇప్పుడు రూ.49,900కు తగ్గించారు.
  ప్రారంభ ధర రూ.99,900 గా ఉన్న ఎక్స్ ఎస్ ధర రూ.89,900 పడిపోయింది.  ఐఫోన్ ఎక్స్ ఆర్ 64జీబీ వేరియంట్ రూ.49,900.. 128 జీబీ ధర రూ.54,900గా మార్చారు. ఎక్స్ ఎస్ 256 జీబీ ధర 1,03,900కు తగ్గించారు. తొలుత దీని ధర రూ.1,14,900గా ఉండేది. ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ రూ.49,900, ఐఫోన్ 8 64జీబీ మోడల్ ధర రూ.39,900కు పొందవచ్చు. మరింత పాత మోడల్ అయిన ఐఫోన్ 7 32జీబీ, 128 జీబీ ధరలు వరుసగా రూ.29,900.. రూ.34,900కు తగ్గించారు. 7ప్లస్ ధరలు 37,900 (32జీబీ) రూ.42,900 (128 జీబీ)గా ఉన్నాయి. ఐతే  తగ్గించిన ఈ ధరలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది.