అనుష్కతో విరాట్ రొమాంటిక్ సెల్ఫీ.. !
ప్రపంచకప్ మిస్సయిందన్న బాధ నుంచి టీమిండియా త్వరగానే బయటపడింది. వరల్డ్ కప్ తర్వాత జరిగిన విండీస్ టూర్ లో అద్భుతంగా రాణించింది. టీ20, వన్డే, టెస్ట్ సిరీస్ లని క్లీన్ స్వీప్ చేసింది. త్వరలో దక్షిణాఫికాతో సిరీస్ కానుంది. ఈ గ్యాప్ దొరికిన సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. భార్య అనుష్క శర్మతో కలిసి సేదతీరుతున్నాడు.
అదెక్కడ అన్నది మాత్రం తెలీదు. కానీ ఓ బీచ్ లో చైర్ పై కూర్చున్న అనుష్క ఒళ్లో కూర్చొని ఓ రొమాంటిక్ సెల్ఫీ తీసుకొన్నాడు విరాట్. దాన్ని అభిమానులతో పంచుకొన్నాడు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో విరాట్ అనుష్క ఒళ్లో కూర్చొని ఆమె ఎదపై వాలీపోయాడు. అనుష్క కూడా స్టయిలీష్ పోజుతో భర్తతో సెల్ఫీని ఎంజాయ్ చేసింది. ఈ పిక్ ని మీరు చూసేయండీ.. !
— Virat Kohli (@imVkohli) September 11, 2019