స్టార్ హీరోతో అజయ్ భూపతి సినిమా

తొలి సినిమా ‘ఆర్ఎక్స్100’తో ప్రతిభ ఉన్న దర్శకుడు అనిపించుకొన్నాడు అజయ్ భూపతి. ఆయన రెండో సినిమా కోసం ‘మహాసముద్రం’ కథని రెడీ చేసుకొన్నాడు. కానీ హీరో సెట్ కావట్లేదు. రవితేజతో ‘మహాసముద్రం’ ఓకే అయింది. ఆ తర్వాత కొన్ని కారణాల వలన క్యాన్సిల్ అయినట్టు తెలిసింది. ఈలోపు అజయ్ భూపతి మూడో సినిమాపై ప్రకటన వచ్చేసింది. 

అజయ్ భూపతి మూడో సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్ ఉండనుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ స్టార్ హీరోతో సినిమా ఉండనుందని భవ్యా క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఆ స్టార్ హీరో ఎవరు ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. భవ్యక్రియేషన్స్ తన ప్రకటనలో సన్సేషనల్ స్టార్ హీరో అని పేర్కొంది. దీంతో ఆ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కావొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.