యాషెస్ : ఆఖరి టెస్టు.. ఆసీస్ గెలిస్తే చరిత్రే !

2001లో స్టీవా సారధ్యంలోని ఆసీస్ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై యాషెస్ సిరీస్ ని 4-1 తేడాతో గెలుచుకొంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డపై ఆసీస్ యాషెస్ సిరీస్ ని గెలవలేదు. ఐతే, ఈసారి ఆసీస్ కి అద్భుత అవకాశం దక్కింది. ఆసీస్ స్టార్ బ్యాట్స్ మెన్ స్మిత్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. తొలి టెస్టులో ఒంటిచేత్తో ఆసీస్ ని గెలిపించాడు. రెండు టెస్టు డ్రాగా మారారింది.

గాయం కారణంగా స్మిత్ విశ్రాంతి తీసుకొన్న మూడో టెస్టుని ఇంగ్లాండ్ గెలుచుకొంది. మళ్లీ రీ ఎంట్రీతో నాలుగో టెస్టులో స్మిత్ అదరగొట్టాడు. ఫలితంగా నాల్గో టెస్టుని ఆసీస్ ని గెలిచింది. ఇక, ఆఖరి ఐదో టెస్టు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆఖరి టెస్టులో గెలిచి చరిత్ర సృష్టించాలని ఆసీస్ భావిస్తోంది. ఎలాగైన గెలిచి తమ పరువు కాపాడుకోవాలనుకుంటున్నా ఇంగ్లండ్‌ భావిస్తోండి. స్మిత్‌ను అడ్డుకుంటేనే ఇంగ్లండ్‌ ఈ సిరీస్‌ను డ్రా చేసుకోగలదు. లేదంటే దాదాపు రెండు దశబ్దాల తర్వాత సొంతగడ్డపై సిరీస్‌ కోల్పోయిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకోనుంది.