రూ. 17.60లక్షల ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డు


బాలాపూర్ గణేషుడి లడ్డూ మరోసారి రికార్డ్ ధర పలికింది. బాలాపూర్ లడ్డూని రూ. 17.60లక్షలకి కొలను రామిరెడ్డి సొంతం చేసుకొన్నారు. గత ఏడాది బాలాపూర్‌ లడ్డూ వేలం రూ.16లక్షల 60వేలు పలికింది. ఈ యేడాది మరో లక్ష రూపాయాలు అధికంగా పలికింది. బాలాపూర్ లడ్డూని దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. ఫైనల్ గా రూ. 17.60లక్షలకి కొలను రామిరెడ్డి దక్కించుకొన్నారు. గత మూడేళ్లుగా బాలాపూర్ లడ్డూని దక్కించుకోవడానికి కొలను రామిరెడ్డి ప్రయత్నించారు. ఈసారి ఆయన ప్రయత్నం ఫలించింది. ఈ లడ్డూ దక్కించుకొన్న కుటుంబంలో వ్యాపారం బాగా కలిసిస్తుందని చెబుతారు.