పెళ్లి కానుకలు యేడాదికి రూ. 1800కోట్లు

మంత్రి ఈటెల మళ్లీ పనిలో పడ్డాడు. ఇటీవల తెరాసలో ఆయన ధికార స్వరాన్ని వినిపించిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈటెల మంత్రి పదవి ఊడనుందనే ప్రచారం జరిగింది. దీనిపై ఈటెల ఘాటుగా స్పందించారు. గులాభి జెండాకు అసలైన ఓనర్లమని ప్రకటించుకొన్నారు. ఆయన మాటలకి మరికొందరు నేతలు మద్దతుపలకడంతో తెరాసలో అసమ్మతి స్వరం వినిపించినట్టయింది. ఫైనల్ గా ఈటెల మంత్రి పదవి ఊడలేదు. ఎవరికి ఉద్వాసన పలకకుండా కొత్తగా ఆరుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారు సీఎం కేసీఆర్. 

ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల పనిలో పడ్డారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శణ చేస్తున్నారు. రాత్రివేళల్లోనూ ఆసుపత్రుల్లోనే పడుకొన్నారు. విష జ్వరాల నేపథ్యంలో వైద్యులు ఎవరు సెలవులు పెట్టకూడదని సూచించారు. తాజాగా ఈటెల కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పర్యటిస్తున్నారు.  ఈ పర్యటనలో భాగంగా.. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలు కోసం ఏడాదికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 30 రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.