జయసుధ కొడుపెళ్లి.. ముహూర్తం ఫిక్స్ !
సీనియర్ నటి జయసుధ ఇంట్లో పెళ్లి భాజాలు మ్రోగనున్నాయి. జయసుధ పెద్ద కొడుకు నిహార్ కపూర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్ ని వివాహం ఆడనున్నాడు. అమ్రిత్ సినిమా పరిశ్రమకి చెందిన అమ్మాయి కాదు. ఆమె ఢిల్లీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిది ప్రేమ వివాహామా ? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా ?? అనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 26న నిహార్ కపూర్-అమ్రిత్ కౌర్ ల వివాహం జరగనుంది. వేదిక ఎక్కడ అన్నది ఇంకా ఖరారు కాలేదు.
1985లో జయసుధ-నితిన్ కపూర్ ల వివాహం అయింది. నితిన్ కపూర్ బాలీవుడ్ నటుడు జితేంద్రకు సోదరుడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు నిహార్ కపూర్. హిందీలో ‘మేరా పతి సిర్ఫ్ మేరా హై’, తెలుగులో ‘కలికాలం’, ‘హ్యాండ్సాఫ్’ చిత్రాలని నిర్మించారు. చిన్నకొడుకు శ్రేయాన్ ‘బస్తీ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కాగా, గత యేడాది జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలోని తన కార్యాలయ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.