నిమజ్జనానికి కదిలిన మహాగణపతి
ఈసారి ఖైరతాబాద్ మహా గణపతిని ముందుగా నిమజ్ఝనం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉదయం 6గంటల నుంచే మహాగణపతి శోభ యాత్రని ప్రారంభించారు. ఆఖరి పూజ అందుకొన్న తర్వాత మహా గణేషుడిని క్రేన్ సహాయంతో భారీ వాహనంపైకి ఎక్కించారు. మహాగణపతి నిమజ్జనానికి కదిలాడు. మధాహ్నం 1గంటలోపు మహాగణపతి నిమజ్ఝాన్ని పూర్తి చేయనున్నారు. నెక్లస్ రోడ్డులోని క్రేన్ నంబర్ 6వద్ద మహాగణపతి నిమజ్ఝనానికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 40వేల వరకు గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచే అమలవుతున్న దృష్ట్యా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలు తీసుకొస్తే ఇబ్బందులు పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు, భద్రతని కట్టుదిట్టం చేశారు.