కోఠి కొత్త అవతారం చూశారా ?


సంగీత దర్శకుడు కోటి కొత్త అవతారంలోకి మారిపోయాడు. చేత లాఠి పట్టీ.. గుండాలని ఇరగదీయడానికి రెడీ అయ్యాడు. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో నందమూరి తారకరత్న కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో కోఠి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. 

గురువారం  కోటికి సంబంధించిన లుక్  చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో ఇది రెండో దశ. సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మీ ముందుకు రాబోతున్నాను. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నా చిన్నప్పుడు మా నాన్న నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకొన్నా’ అన్నారు.