‘వెంకీమామ’ కోసం కొత్త డేటు
‘సైరా’ పోటీపడదాం అనుకొన్నాడు ‘వెంకీమామ’. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వద్దామని అనుకొన్నాడు. కానీ సైరా పోటీ వద్దు. సింగిల్ గా వద్దమనుకొన్నాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 25 మంచి డేట్ అనుకొన్నారు. ఐతే, ఆ డేటుకి విజయ్-అట్లీ కాంబినేషన్లోని ‘విజిల్’, కార్తీ తమిళ డబ్బింగ్ సినిమా, అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ రానున్నాయి. ఈ నేపథ్యంలో వెంకీమామ మరో కొత్త డేటుని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ఏకంగా డిసెంబర్ ఫస్ట్ వీక్ కి వెళ్లినట్టు సమాచారమ్. తేజు ‘ప్రతిరోజు పండగే’ కూడా డిసెంబర్ లో రానుంది.
బాబీ (కె.యస్ రవీంద్ర) దర్శకత్వంలో ‘వెంకీమామ’ తెరకెక్కుతోంది. మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ ప్రేక్షకులని అలరించనున్నాడు. ఇందులో వెంకీకి జంటగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఎఫ్2 తర్వాత వెంకీ, మజిలీ తర్వాత చైతూ నటిస్తున్న చిత్రమిది. పూర్తి వినోదాత్మకంగా సినిమాని తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు.