లారీ డ్రైవర్ రూ.2లక్షల జరిమానా
ఢిల్లీలో ట్రకు డ్రైవర్ కు ఏకంగా రూ. 2లక్షల జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టంలో ఇదే అతి భారీ జరిమానా కావడం విశేషం. ముఖర్భా చౌక్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా ఓ ట్రక్కును ఆపిన పోలీసులు ఓవర్ లోడ్ కారణంగా ఏకంగా అక్షరాలా రెండు లక్షల ఐదు వందల రూపాయలు జరిమానాగా విధించారు.
ఇక కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టంలో అవసరమైతే మార్పులు చేసుకొనే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలని ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం జరిమానాలని తగ్గించింది. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చలానా రేట్లని తగ్గించాలనే ఆలోచనలో ఉన్నాయి. ఐతే, ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదని. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చలానాలు కట్టాల్సిన పనిలేదని గడ్కరీ అంటున్నారు.