‘సైరా’ ఓవర్సీస్ రేటెంతో తెలుసా ?

ప్రభాస్ ‘సాహో’ సినిమా విదేశీ పంపిణీ హక్కులని ఫారస్ సంస్థ తీసుకొన్న సంగతి తెలిసిందే. ఐతే సగానికి సగం నష్టాలు తప్పలేదు. ఇప్పుడు ‘సైరా’ సినిమా విదేశీ పంపిణీ హక్కులని ఈ సంస్థనే తీసుకొంది. రూ. 15కోట్లకి సైరా ఓవర్సీస్ రేటు పలికింది. ఇది ఇరువర్గాలకి మంచి రేటుయే అని చెబుతున్నారు. ఇటీవల ఓవర్ సీస్ మార్కెట్ బాగా పడిపోయింది. 

‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ సినిమానే అనుకున్న రేంజ్ కు చేరడం కష్టం అయింది. సాహో సినిమా సగానికి సగం నష్టాలు మిగిల్చింది. ఈ నేపథ్యంలో సైరాకు రూ. 15కోట్లు మంచి రేటు అని చెబుతున్నారు. ఇక, సైరాని అమెరికాలో ఫారస్ సంస్థనే పంపిణీ చేస్తుందా ? లేక అక్కడ తెలుగు సినిమాల పంపిణీ లో అనుభవం వున్న సంస్థకు అప్పగిస్తుందా ?? అన్నది తెలియాల్సి ఉంది. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. తొలి తరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో చిరు నరసింహారెడ్డిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చ సుధీప్, తమన్నా, అనుష్క, నయనతార కీలక పాత్రల్లో నటించారు. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.