ధోనీ రిటైర్మెంట్ పై విశ్వనాథన్ ఆనంద్ కామెంట్
ప్రపంచకప్ సెమీ ఫైనల్ తర్వాత ధోనీ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనే వార్తలు వచ్చాయి. ఐతే రిటైర్మెంట్ పై అతడెలాంటి ప్రకటనలు చేయకపోవడంతో మహీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటన్న సందేహం కలిగింది. విండీస్ పర్యటన సందర్భంగానూ ధోనీపై ఇలాంటి ఊహాగానాలు వచ్చాయి. అతడిని ఎంపిక చేస్తారా లేదా అని అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. ధోనీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలని మాజీ క్రికెటర్లు సెలక్టర్లకు సూచించారు. చివరికి సైన్యంలో సేవ చేస్తానని రెండు నెలలు జట్టుకు దూరమయ్యాడు మహీ. ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్ కి ముందు మరోసారి మహీ రిటైర్మెంట్ హాట్ టాపిక్ గా మారింది.
గురువారం సాయంత్రం ధోని ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. అది రిటైర్మెంట్ ప్రకటించేందుకు అనే వార్తలు వినిపించాయి. ఇది నిజమేనేమో అన్నట్టుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధోనితో ఓ జ్ఝాపకాన్ని గుర్తుచేసుకోవడం విశేషం. ఐతే, ధోని రిటైర్మెంట్ పై తమకు ఎలాంటి సమాచారమ్ లేదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అనడంతో ధోని అభిమానులు సంబురపడిపోయారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ పై ఆసక్తిర ట్విట్ చేశారు చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.
‘ధోనీ క్రికెట్ లో అన్నీ సాధించేశాడు. ధోనీ సారథిగా రెండు ప్రపంచకప్ లు (2007 టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్) అందించాడు. అతడో అద్భుతమైన నాయకుడు. అతడు పోటీపడుతూ ఇంకా పరుగెత్తి సాధించాల్సినవి ఏవీ లేవు. ఎప్పుడు వీడ్కోలు పలకాలో ధోనీకి బాగా తెలుసు. అతడిది అద్భుతమైన కెరీర్’ అని ఆనంద్ అన్నాడు