వైరల్ : బోయ్ ఫ్రెండ్ తో అర్చన రొమాంటిక్ ఫోటోస్
హీరోయిన్ అర్చన ప్రేమలో ఉంది. ఈ విషయం బిగ్ బాస్ తెలుగు సీజన్-1 సమయంలోనే తెలుసు. కానీ అతడు ఎవరు ? ఎలా ఉంటాడు ? అనే విషయాలేవీ తెలీదు. ఇప్పుడు అర్చన తన బోయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అతడితో రొమాంటిక్ గా దిగిన ఫోటోలని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని తెలిపింది. అదే పెళ్లి ప్రకటన. ఆ సమయంలో బోయ్ ఫ్రెండ్ పూర్తి వివరాలని చెప్పేటట్టు ఉంది. ఇప్పుడైతే.. బోయ్ ఫ్రెండ్ తో అర్చన ఫోటోలు వైరల్ అవుతున్నాయ్.
అల్లరి నరేష్ ‘నేను’ సినిమాతో హీరోయిన్ గా తెరకు పరిచయం అయింది అర్చన. అర్చన మంచి డ్యాన్సర్. ‘యమదొంగ’లో ఓ పాటలో మెరిసింది. మంచి అందం, అభినయం తెలిసిన అర్చన బిజీ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. యంగ్ టైగర్ ఎన్ టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించింది. ఆమె చివరగా ‘ఫైనల్ ఎగ్జిట్’ అనే హిందీ సినిమాలో నటించింది. కెరీర్ కి దాదాపు పులిస్టాప్ పడటంతో పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని అనుకొంటున్నట్టు ఉంది.