గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం


యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం అయింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు బిను సుబ్రమణ్యం దర్శకత్వం వహించనున్నారు. ఇదో యాక్షన్ వెంచర్. మణిశర్మ సంగీతం అందించనున్నారు. సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. బివిఎన్ ఎస్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

ఇక, తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్ నటించిన ‘చాణిక్య’ సినిమా దసరా కానుకగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన దక్కింది. ఈ నెల 15న సినిమా నుంచి తొలిసాంగ్ ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి రామబ్రహం సుంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది.