నానిని లేపారా.. ? లేదా.. ??

‘గ్యాంగ్ లీడర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు నాని. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఆయన నటించన చిత్రమిది. ప్రియాంక మోహన్ కథానాయిక. ఆర్ఎక్స్100 కథానాయకుడు కార్తీకేయ ప్రతినాయకుడుగా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య నాని గ్యాంగ్ లీడర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సినిమా రిలీజ్ కి కొద్దిసేపటి ముందు నాని ఆసక్తికర ట్విట్ చేశారు. సీనియర్ నటి లక్ష్మీ భుజాలపై హాయిగా నిద్రపోతున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. “‘ఈ మూవీ సూపర్ హిట్ అయితే లేపండీ. లేదంటే లేపకండీ” అంటూ కామెంట్ పెట్టాడు”. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ బెనిఫిట్ షోస్, ఉదయం పూట ఆట కూడా పడిపోయింది. సినిమా టాక్ బయటికొచ్చింది. గ్యాంగ్ లీడర్ సూపర్  హిట్ అని నాని ఫ్యాన్స్ చెబుతున్నారు. నాని, అతని గ్యాంగ్ నటన సూపర్భ్. విక్రమ్ స్క్రీన్ ప్లే అదిరింది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్ హైలైట్. క్లైమాక్స్ 10నిమిషాలు ఎమోషన్స్ పీక్స్ తీసుకెళ్లారని చెబుతున్నారు. 

మరోవైపు, గ్యాంగ్ లీడర్ పై మిక్సిడ్ టాక్ కూడా వినిపిస్తుంది. ఫస్టాఫ్ బాగుంది. సెకాంఢాఫ్ లో సాగదీత అనిపించింది. గ్యాంగ్ లీడర్ యావరేజ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో నాని ట్విట్ పై సటైర్స్ వేస్తున్నారు. ‘ఇప్పట్లో నిద్ర లేవడా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ నానిని నిద్రలేపారా ? అలాగే పడుకోనిచ్చారా ?? అనేది తెలియాల్సి ఉంది.