విజయసాయికి జీతం కట్


వైకాపా కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి జీతం కట్ చేసింది ఏపీ ప్రభుత్వం. విజయసాయి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై విమర్శొచ్చాయ్. రాజ్యసభ సభ్యునిగా ఉన్నవారు లాభదాయక పదవుల్లో ఉండరాదని నిబంధనలు ఉన్నాయి. దీనిపై టీడీపీ రాష్ట్రపతి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. విజయసాయికి జీతం కట్ చేసింది.

జీతం ఇవ్వకుండా కేవలం హోదాను మాత్రమే ఇచ్చేలా విజయసాయిరెడ్డికి జీతంలో కోత పెట్టింది. జోడు పదవుల విషయంలో గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డికి అన్ని విషయాలపై అవగాహన ఉంటుంది కాబట్టి కేంద్రం నుండి నిధుల్ని రాష్ట్రానికి తేలికగా తీసుకొనివచ్చే అవకాశం ఉందని ఆయనకి ఆ పదవిని ఇచ్చారు. ఇక దీనిపై వస్తున్న విమర్శలకి ఆయనకి జీతం ఇవ్వకుండా పని చేసుకుంటున్నట్టు చూపించనున్నారు.