ప్రభాస్ ఫ్యాన్స్ గొప్ప మనసు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ బాధలో ఉన్నారు. ‘సాహో’ ఆశించిన స్థాయిలో లేదు. ఐతే అది కథ-కథనంలో లోపం అని తేలిపోయింది. ప్రభాస్ మాత్రం అద్భుతంగా నటించారు. అభిమానులకి ఆ సంతృప్తి మిగిలింది. కానీ, బ్లాక్ బస్టర్ హిట్ కాలేకపోయింది. బాహుబలి రేంజ్ రెస్పాన్స్ రాలేదనే బాధ ఉందనే చెప్పాలి. ఈ బాధలోనూ ప్రభాస్ ఫ్యాన్స్ గొప్ప మనసు చాటుకొన్నారు. 

నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు ప్రభాస్ ఫ్యాన్స్ ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్స్ పెడుతున్నారు. అది అందరినీ ఆకట్టుకుంటోంది. తమ అభిమాన హీరో ప్రభాస్ సాహో ఇంకా థియేటర్స్ లోనే ఉంది. ఇప్పటికే రూ. 370కోట్ల గ్రాస్ ని రాబట్టింది. కొన్ని చోట్ల ఇంకా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అయినా.. ప్రభాస్ అభిమానులు నాని గ్యాంగ్ లీడర్ ని తమ సొంత సినిమాగా భావిస్తుండటం విశేషం. ఈ విషయంలో నాని ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కృతజ్ఝతలు చెప్పాల్సింది. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని గ్యాంగ్ లీడర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.