తెదేపాకు తోట గుడ్ బై !


ఏపీలో తెదేపాకు మరో షాక్ తగలనుంది. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన తెదేపా కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ వీడేందుకు రెడీ అయ్యారు. ఆయన కొన్నాళ్లుగా పార్టీకి అంటిముంటన్నట్టుగా ఉంటున్నాడు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనలో పాల్గొనలేదు. దీంతో ఆయన పార్టీ వీడటం ఖాయమనుకొన్నారు. ఇప్పుడీ దీనిపై తోట పార్టీ మార్పుపై మరింత క్లారిటీ వచ్చింది. ఈ నెల 18న సీఎం జగన్ సమక్షంలో తోట వైకాపాలో చేరబోతున్నట్టు సమాచారమ్.

మరోవైపు, తోట రాకను తూర్పుగోదావరి వైకాపా నేతలు వ్యతిరేకిస్తున్నారు. మాకొద్దు ఈ మాయదారి తోట అంటూ ఇటీవలే తమ నిరసనని వ్యక్తం చేశారు. ఇక, సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెదేపా నుంచి దాదాపు 10మంది ఎమ్మెల్యేలు వైకాపాలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారమ్. తెదేపా మాత్రం పార్టీ వీడేవారిని పెద్దగా బుజ్జగించే పని పెట్టుకోవడం లేదు. దానికి బదులుగా యువ నాయకులని తయారు చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, అధికారంలేని పార్టీ వైపు యువకులు కూడా చూడటం లేదట.