వెంకీ సెంటిమెంట్ ఫాలో అవుతున్న వాల్మీకి !

ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ ఉంది. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా సినిమా టీజర్, ట్రైలర్ ని విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇక ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తే.. అది సూపర్ హిట్టే. అందుకే వెంకీకి సినిమా ఫంక్షన్స్ ఆహ్వానాలు బాగా వస్తాయట. వీలుని బట్టి కొన్ని సినిమా ఫంక్షన్స్ కి మాత్రమే వెంకీ హాజరవుతుంటారు. అవి హిట్ అవుతున్నాయి కూడా.

ఇప్పుడు వాల్మీకి చిత్రబృందం కూడా వెంకీ సెంటిమెంట్ ని ఫాలో అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం (సెప్టెంబర్ 15)హైదరాబాద్ శిల్పాకళావేదికలో వాల్మీకి ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి వెంకీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

వెంకీ-వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అత్యధిక లాభాలు తీసుకొచ్చిన తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. అసలు సిసలు సంక్రాంతి సినిమా అనిపించుకొంది. ఈ సినిమాతో వెంకీతో వరుణ్ కి అనుబంధం పెరిగింది. ఆ అనుబంధంతోనే వెంకీ వాల్మీకి ప్రీ రిలీజ్ వేడుకకి రావడానికి ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. ఇక వెంకీ-చైతూ కలయికలో తెరకెక్కుతోన్న వెంకీమా డిసెంబర్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.