‘బందోబస్త్’ ట్రైలర్ టాక్


తమిళ్ స్టార్ సూర్య తాజా చిత్రం ‘కప్పాన్’. తెలుగులో  ‘బందోబస్త్’గా రానుంది. ఇందులో సూర్య వివిధ గెటప్ లలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు. సాయేషా సైగల్ కథానాయిక. సుభాస్కరన్ నిర్మాత. తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

తాజాగా బందోబస్త్ ట్రైలర్ ని విడుదల చేశారు. యాక్షన్ హైలైట్ గా ట్రైలర్ ని కట్ చేశారు. టెర్రరిస్ట్ అటాక్స్, సెక్యూరిటీ అధికారిగా సూర్య చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి.  మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర, బోమన్ ఇరానీ పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘పోలీసులు నీళ్ళూ అందిస్తారు..నిప్పులూ కురిపిస్తారు’ అంటూ సూర్య చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి యాక్షన్ ప్రియులు మెచ్చేలా బందోబస్త్ ట్రైలర్ ఉంది.