ప్రగతి భవన్ లో శునకం మృతి.. డాక్టర్ పై కేసు !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ లో ఓ శునకం జ్వరంతో మృతి చెందింది. 11 నెలల హస్కీ అనే కుక్క ఈనెల 10వతేదీ సాయంత్రం వరకు బాగానే ఆడింది. రాత్రి తిండి తినలేదు. మరునాడు ఉదయం పాలు తాగలేదు. ఉదయం 11 గంటలకు నిత్యం వీటిని పరీక్షించే పశువైద్యుడికి సమాచారం అందించారు. ఆయన మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చి హస్కీని పరీక్షించగా 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతోంది. దీంతో హస్కీని యానిమల్ కేర్ క్లినిక్ లో చేర్పించారు.

క్లినిక్ లో హస్కీ చికిత్స పొందుతూ మృతి చెందింది. శ్వాస అందక హక్సీ మృతి చెందినట్టు తెలిసింది. దీనికి కారణం.. ఆసుపత్రి నిర్వాహకురాలు లక్ష్మిలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు 429, 11(4) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజుగారి కుక్క చస్తే.. ఆ మాత్రం దర్యాప్తు చేయాల్సిందే మరీ.. !