బిగ్ బాస్ పై కోపంగా నాగ్


కింగ్ నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులపై పీకల్లోతు కోపంతో ఉన్నారు. శనివారం ఏపీసోడ్ లో హౌస్ సభ్యులని కడిగేయనున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. ప్రోమోలో కోపంగా వచ్చిన నాగ్ ఇంట్రో సాంగ్ ని క్యాన్సిల్ చేశాడు. ‘స్టాప్. ఇవాళ నో సాంగ్, నో డ్యాన్స్ అందరు లోపలికి వెళ్లిపోండి. పీకలదాక ఉంది.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వాళ్లతో మాట్లాడాలి’ అంటూ నాగ్ కోపంగా చెప్పడం చూడొచ్చు.

బహుశా.. ఈవారం హౌస్ సభ్యులు బిగ్ బాస్ ఇచ్చిన లగ్జిరీ టాస్క్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే శనివారం నాటి ఏపీసోడ్ లో నాగ్ హౌస్  సభ్యులకి గట్టి క్లాస్ పీకేలా కనబడుతోంది. ఇక ఈ వారం హౌస్  నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. గతవారం అలీ రెజీనా ఎలిమినేషన్ హౌస్  సభ్యులు, ప్రేక్షకులని షాక్ కి గురిచేసింది. మరీ.. ఈ వారం కూడా ఊహించనివారు ఎలిమినేట్ అవుతారేమో చూడాలి.