అఖిల్’కి హీరోయిన్ సమస్య తీర్చిన ప్రభాస్


అక్కినేని యంగ్ హీరో అఖిల్ కి హీరోయిన్ సమస్య అనేది చాలా విచిత్రం. సీనియర్ హీరోలు బాలయ్య, వెంకీ.. యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు. అలాంటిది అఖిల్ కి హీరోయిన్ దొరకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాల్గో సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్ దొరక్క ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఫైనల్ గా పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకొన్నారు. కానీ, ఆమె ప్రభాస్ సినిమాకి డేట్స్ ఇచ్చి ఉంది. రాథాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమాలో పూజానే హీరోయిన్. సాహో సినిమా విడుదలైన వెంటనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలి అనుకొన్నారు. 

సాహో రిజల్ట్ తర్వాత రాథాకృష్ణ సినిమా కథలో కొన్ని మార్పులు చేస్తున్నారు. దీంతో షూటింగ్ ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని గ్రహించిన అఖిల్ వెళ్లి ప్రభాస్ ని కలిశాడట. పూజా హెగ్డే కాల్షీట్లని తాము వాడుకొంటామని, మా సినిమా కోసం ఇచ్చిన డేట్స్ ని మీరు తీసుకొమని కోరాడట. అందుకు ఓకే డార్లింగ్ అన్నాడట ప్రభాస్. దీంతో అఖిల్ కి హీరోయిన్ సమస్య తీరింది. పూజా ముందుగా అఖిల్ తో ఆ తర్వాత ప్రభాస్ తో రొమాన్స్ చేయనుంది. అన్నట్టు అఖిల్ సినిమా కోసం పూజా భారీ రెమ్యూనరేషన్ తీసుకోనుందట. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.