చిరు ఆఫీస్ ఎదుట ఆందోళన


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు. చరిత్ర మరిచిపోయిన ఈ యోధుడి కథని వెండితెరపై గొప్పగా చూపించబోతున్నారు. ఇందుకోసం దాదాపు రూ. 250కోట్లు ఖర్చుపెట్టారు. అదేసమయంలో ఉయ్యాలవాడ కుటుంబీకులకి చిత్రబృందం న్యాయం చేయలేకపోయింది. ఉయ్యాలవాడ జీవితకథపై పరిశోధన చేసే సమయంలో ఆయన కుటుంబీలకి కలిసింది చిత్రబృందం. నరసింహారెడ్డి జీవిత విశేషాలని అడిగి తెలుసుకొంది. ఆ సమయంలో వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ మేరకు నిర్మాత అయిన రామ్ చరణ్ ఉయ్యాలవాడ కుటుంబీలకి హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అదే మాట చెప్పారు. దీంతో ఉయ్యాలవాడ కుటుంబీకులు ఆశలుపెట్టుకొన్నారు. ఇప్పుడేమో సైరా సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం నుంచి ఎలాంటి సాయం, న్యాయం అందలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకట్రెండు సార్లు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు ఉయ్యాలవాడ కుటుంబీకులు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆఫీస్ ముందు నిరసనకి దిగారు. 

తమకి న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏ రకమైన న్యాయం అనేది మాత్రం చెప్పలేదు. చివరికి పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఉయ్యాలవాడ జీవితకథని వెండితరపై గొప్పగా ఆవిష్కరించబోతున్న చిత్రబృందం. ఆయన కుటుంబీకులని ఇలా చిన్ని చూపు చూడటంపై విమర్శలొస్తున్నాయ్. వారికి కూడా తగిన విధంగా న్యాయం చేస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ.. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ ఏం చేస్తుందన్నది చూడాలి. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.