‘గ్యాంగ్ లీడర్’ వీకెండ్ కలెక్షన్స్ లెక్కంత ?


‘గ్యాంగ్ లీడర్’గా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రమిది. ప్రియా అరుల్ మోహన్ కథానాయిక. ఆర్ఎక్స్100 హీరో కార్తీకేయ విలన్ గా నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని గ్యాంగ్ లీడర్ మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. ఐతే, టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం. తొలిరోజే ఈ సినిమా రూ. 4కోట్లకిపైగా కలెక్ట్ చేసింది. 

ఇక వీకెండ్ లోనూ బాక్సాఫీస్ దగ్గర గ్యాంగ్ లీడర్ హవా కొనసాగింది.  వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో రూ.11.84 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. అక్కడ వీకెండ్ లో 7 లక్షల 25 వేల డాలర్లు వసూలు చేసింది. ఇక ఏరియాలవారీగా చూస్తే..  నైజాం రూ. 4.67కోట్లు, సీడెడ్ రూ 1.48కోట్లు, ఉత్తరాంధ్ర రూ 1. 57కోట్లు,  గుంటూరు రూ. 1.09కోట్లు, తూర్పు గోదావరి రూ. 1.06కోట్లు, కృష్ణా రూ 0.93కోట్లు, నెల్లూరు రూ. 0.36 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 0.68కోట్లు వసూలు చేసింది.