డాక్టర్ కోడెల హస్తవాసి గొప్పది


టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలచివేస్తోంది. కోడెల వయస్సు 72 సంవత్సరాలు. 1947 మే 2న గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. వీరికి మధ్య తరగతి కుటుంబం. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్థిక స్తోమతలేకున్నా కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు. ఆయన హస్తవాసి గొప్పదని చెబుతుంటారు. ఎన్టీఆర్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చారు.

1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన ఆయన ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు. ఇక ఇటీవల వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెలపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. కోడెల కూతురు విజయలక్ష్మి, కొడుకులు శివరామకృష్ణ, సత్యన్నారాయణలు వసూళ్లకి పాల్పడ్డారనే ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలోనూ కోడెల పరువుపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయక కృంగిపోయి ఆత్మహత్య చేసుకొంటారని కుటుంబ సభ్యులు తెలిపారు.