‘రాజుగారి గది3’ ట్రైలర్ టాక్

రాజుగారి గది పార్ట్1, పార్ట్ 2లు మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఈ సిరీస్ లో మూడో పార్ట్ రెడీ అవుతోంది. మూడో గదిలో అశ్విన్ బాబు, అవికాగోర్ జంటగా నటించారు. దసరాకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ లో విక్టరీ వెంకటేష్ ట్రైలర్ ని విడుదల చేశారు. వందశాతం ప్రేక్షకులకి వినోదం పంచే చిత్రమిదని దర్శకుడు ఓంకార్ అన్నారు. ఐతే, ట్రైలర్ లో మాత్రం వినోదం కంటే హారర్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 

దెయ్యం లుక్ లో అవికా, అశ్విన్ భయపెట్టే ప్రయత్నం చేశారు. అలీ, ధనరాజ్ దెయ్యాలకి బలైన ఎక్స్ ప్రెషన్స్ తో మెరిశారు. ట్రైలర్ లో స్టోరీ లైన్ ని లీక్ చేయకుండా సినిమా మూడ్ ని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈసారి అశ్విన్ కి నటించే స్కోక్ ఎక్కువగా దక్కినట్టు కనిపించింది. అవికా ఆవహించిన ఆశ్విన్ లా ఓ బిట్ సీన్ లో అద్భతంగా నటించారు.