రెండో వైల్డ్ కార్డ్ అట్టర్ ప్లాప్

బిగ్ బాస్ 3 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కలిసిరాలేదు. రెండోవారానికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ తమన్నా సింహాద్రి ని హౌస్ లోకి పంపించారు. హౌస్ లో ఆమె చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. దాంతో ఆమెని ఎంట్రీ ఇచ్చిన రెండోవారానికే బయటికి పంపేశారు. ఇక, దాదాపు 50రోజుల షో ముగిసిన తర్వాత రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది. 

శిల్పా రాకతో ఎంటర్ టైన్ మెంట్ డబుల్ అవుతుందని భావించారు. కానీ, అలాంటిదేమి జరగలేదు. ఇదో ఉన్నానా అంటే ఉన్నా అన్నట్టుగా శిల్పా వ్యవహరించింది. దాంతో ఆమెని రెండోవారానికే బయటి పంపించక తప్పలేదు. ఈవారం శిల్పా హౌస్  నుంచి ఎలిమినేట్ అయింది. శిల్పతో పాటు శ్రీముఖి, హిమజ, మహేశ్ విట్టా, పునర్నవిలు కూడా నామినేట్ అయ్యారు. అయితే, ప్రేక్షకుల నుంచి శిల్పకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు.