మంచు లక్ష్మీ షో : బెడ్ రూంలో సెలబ్రేటీస్ లైఫ్


బాలీవుడ్‌లో ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అంటూ ఓ క్రేజీ షో వస్తోంది. కాస్త ఫన్, క్రేజీ, ఇంకాస్త హాట్‌గా ఉండే ఎన్నో విషయాలను ఫిల్మ్‌ స్టార్లు ఈ కార్యక్రమంలో షేర్‌ చేసుకుంటుంటారు. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి స్పైసీ షో రాబోతోంది. మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. దీన్ని తెలుగులో ‘బెడ్ టైమ్ స్టోరీస్’ లేదా ‘బెడ్ టైమ్ ఇంటర్వ్యూ’ అని అనుకోవచ్చు. ఈ షోని వయాకామ్ 18 నిర్వహించనుంది. ఈ నెల 23 నుంచి షో ప్రారంభం కానుంది. 

ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. “ఫీట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నా. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ భావాలను, రహస్యాలను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. అభిమాన తారలను ఫ్యాన్స్ కు దగ్గరగా చేస్తూ  వినోదాత్మకంగా సాగి పోయే విధంగా షోను నడిపించేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పటికే చాలామంది తారలతో ఇంటర్వ్యూలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 23నుంచి షో ప్రారంభం కానుందని తెలిపింది.