సైరా క్లైమాక్స్ మార్చలేదట !

చరిత్రని మార్చలేం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఆంగ్లేయులపై తొలిసారి తిరగబడ్డ యోధుడు నరసింహారెడ్డి. ఆంగ్లేయులని దడదడలాడించి.. వారి గుండెల్లో నిద్రపోయిన ధీరుడు. కానీ చివరకి నరసింహారెడ్డి ఆంగ్లేయుల చేతిలో అతి కిరాతకంగా చంపబడ్డాడు. ఇది నిజం. చరిత్ర చెబుతున్న నిజం. ఐతే, ‘సైరా’ సినిమాలో దాన్ని చూపించడం లేదు. 

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడు. ఆయన పాత్రని చంపితే, విషాద ముగింపు చూపిస్తే అభిమానులు హర్షించరు. అందుకే క్లైమాక్స్ మార్చారని ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదట. చరిత్రని మార్చడం సబబు కాదు. అందుకే సైరా క్లైమాక్స్ గా నరసింహారెడ్డి వీర మరణం ఏపీసోడ్ నే ఉంచారట. ఐతే అది ఉద్వేగభరింతంగా, రోమాలు నిక్కబొడిచేలా ఉంటుందట. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.