నాగ్’కు వైరల్ ఫీవర్
కింగ్ నాగార్జున వైరల్ ఫివర్ తో బాధపడుతున్నారు. దాన్నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడట. అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు పరిసరాలని జాగ్రత్తగా ఉంచుకోండి. నీటి నిల్వలు లేకుండా జాగ్రతపడండీ అంటూ ట్విట్ చేశారు నాగ్. తన ఇంట్లో మరియు అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కడ నీటి నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ అంతా సాఫీగా ఉండేలా చూశానంటూ నాగ్ తెలిపారు. ‘నేను ఇప్పుడిప్పుడే వైరల్ ఫీవర్ నుండి రికవర్ అవుతున్నాను. ఆ సమయంలో నాకు బాడీ పెయిన్స్ విపరీతంగా ఇబ్బంది పెట్టాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా దోమల నుండి జాగ్రత్త పడండి. నేను మా వారికి అంతా నీట్ గా క్లీన్ గా ఉండాలని సూచించాను. మీరు కూడా మీ ఇంటిని ఇంకా చుట్టు పక్కల పరిసరాలను నీట్ గా పెట్టుకోండి’ అని నాగ్ రాసుకొచ్చాడు.
వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా బయటపడకుండా నాగ్ పనిలో పడిపోయారు. శని, ఆదివారాలు బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొట్టేశాడు. శనివారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఓ రేంజ్ లో క్లాస్ పీకాడు. ఆదివారం మాత్రం సరదా సరదాగా గేమ్స్ ఆడిపించి అలరించాడు నాన్. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లోకి శిల్పా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఐతే, రెండు వారాలకే ఆమె ఎలిమినేట్ కావడం విశేషం. మరోవారం తనకి అవకాశం ఉండివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడిప్పుదే అందరితో కలిసిపోతున్నా. అప్పుడే బయటికి రావాల్సి వచ్చిందని శిల్పా అసంతృప్తి వ్యక్తం చేసింది.
#monsoonfever Just about recovered from viral fever.. The body pains were crazy!! Way out is stopping Mosquitoes breeding!! I asked my people to clear out all stagnant water at home and at Annapurna studios… Requesting you all to do it at your place of work and home👍 @KTRTRS pic.twitter.com/NImGNYd18R
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 15, 2019