నాని సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత ?


నటుడు బండ్ల గణేష్ టాలీవుడ్ బడా నిర్మాత అనిపించుకొన్నారు. పలు భారీ బడ్జెట్ సినిమాలు తీశాడు. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొన్నారు. మరికొన్ని ప్లాపులని చవి చూశాడు. ఫైనల్ గా నిర్మాతగా దివాలా తీసి.. సినిమాకి దూరమయ్యాడు. ఆయన నిర్మించిన ఆఖరి చిత్రం ‘టెంపర్’. ఆయన నటుడిగా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో క‌మెడియ‌న్‌గా న‌టిస్తున్నాడు. సినిమాలో వచ్చే ట్రైన్ సీన్ లో గణేష్ తన నటనతో నవ్విస్తాడట. 

ఈ విషయం పక్కనపెడితే.. త్వరలోనే బండ్ల గణేష్ నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పనిచేయనున్నారు. లిమిటెడ్ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారమ్. గతంలో భారీ బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకొన్న బండ్ల.. ఈసారి మాత్రం కథా ప్రాధాన్యం, చిన్న, మీడియం రేంజ్ సినిమాలని మాత్రమే నిర్మించేందుకు ప్లాన్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేసేందుకు బండ్ల ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారమ్. కుదిరితే పవన్ తో లేకపోతే నానితో బండ్ల సినిమా చేయబోతున్నారు అన్నమాట.