కాంగ్రెస్’కు ఈటెల కౌంటర్


మంత్రి ఈటెల కారణంగా కాంగ్రెస్ కు తెరాసని విమర్శించే అవకాశం దొరికొంది. ఇటీవల తెరాసపై ఈటెల అసమ్మతి స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. గులాభి జెండాకు అసలైన ఓనర్లని ప్రకటించుకొన్నారు. ఆయనకి మద్దతుగా రసమయి, నాయిని తదితరులు గొంతు కలిపారు. దీంతో తెరాసలో అసమ్మతి భగ్గుమననుంది అనే ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమీ తలెత్తకుండా చాలా జాగ్రత్తగా తన కేబినేట్ ని విస్తరణని చేపట్టారు సీఎం కేసీఆర్. అదే సమయంలో అసమ్మతి నేతలని బుజ్జగించి చల్లబర్చారు.

ఇప్పుడు కాకపోయినా.. త్వరలోనే తెరాసలో భారీ విస్పోటనం జరగనుంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంతేకాదు.. తమని తాము పాండవులతో పోల్చుకొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు పదేళ్ల వనవాసం. ఫైనల్ గా గెలుపు మాదే. వచ్చేది మా ప్రభుత్వమే అన్న ధీమాని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్సోళ్లకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రి ఈటెల రంగంలోకి దిగారు. టీఆర్‌ఎస్‌లో ఒకే వర్గం ఉంటుందని, కాంగ్రెస్‌ పార్టీలోనే వర్గాలు ఉంటాయని మంత్రి ఈటల అన్నారు. ఈటెల మాటల్లో నిజం లేకపోలేదు. కాంగ్రెస్ లో వర్గాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిల్లాకో రెండు మూడు గ్రూపులుంటాయ్. పార్టీ మీటింగ్స్ లో ఫైట్స్ చేసుకొంటుంటారు.