అందుకే వెంకీకి కౌగిలి ఇవ్వలేకపోయా : పాయల్


‘ఆర్ఎక్స్100’తో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత సీత సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఐటమ్ ప్రియులకి ఖుషి చేసింది. ఆమె నటించిన ఆర్డీఎక్స్ లవ్ రిలీజ్ కి రెడీ గా ఉంది. ఆమె నటిస్తున్న మూడో చిత్రం వెంకీమామ. ఇందులో పాయల్ వెంకీకి జంటగా నటిస్తోంది. ఆ మధ్యన పాయల్ రాజ్ పుత్ వెంకటేష్ కు దూరంగా నిల్చుకుని షేక్ హ్యాండ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. వెంకటేష్ లాంటి స్టార్ హీరో పట్ల పాయల్ రాజ్ పుత్ కు గౌరవం లేదని ట్రోలింగ్ జరిగింది.

ఇటీవల  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్.. ఈ వివాదం గురించి క్లారిటీ ఇచ్చింది. ఆ సమయంలో నేను ఓ చేత్తో తింటున్నా. అలాంటప్పుడు వెంకటేష్ సర్ ని కౌగిలించుకుంటే బావుంటుందా. అందుకే దూరంగా నిలబడే షేక్ హ్యాండ్ ఇచ్చానని తెలిపింది. అవేవీ అర్థం చేసుకోకుండా.. ఈ అమ్మాయికి ఎంత పొగరు అంటూ కామెంట్స్ చేశారు. సాధారణంగా నేను విమర్శలని పట్టించుకోను. కానీ తన తప్పు లేకపోయినా ఇలాంటి కామెంట్స్ చేయడం బాధ అనిపించిందని చెప్పుకొచ్చింది.