రాహుల్’కు పునర్నవి ముద్దు


తన కౌగిలిలో రాహుల్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది పునర్నవి. ప్రేమగా దగ్గరికి తీసుకొని గట్టిగా ముద్దుపెట్టుకుంది. ఈ రొమాంటిక్ సీన్ సోమవారం నాటి బిగ్ బాస్ ఏపీసోడ్ లో జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఎలిమినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేసేందుకు మరొకరు త్యాగాలు, కఠిన టాక్స్ లు చేయాల్సి ఉంటుంది. పునర్నవి కోసం రాహుల్ పెద్ద త్యాగమే చేశాడు. 20 గ్లాసుల కాకరకాయ రసం తాగితే పునర్నవి ఈవారం నామినేషన్ నుండి సేవ్ అవుతుందని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. మధ్యలో వాంతులు అవుతున్నా.. పునర్నవి కోసం టాస్క్ ని పూర్తి చేశాడు రాహుల్. 

దీంతో రాహుల్ ని ప్రేమగా దగ్గరకి తీసుకొంది గట్టిగా ముద్దుపెట్టుకొంది పునర్నవి. కొద్దిసేపు తన కౌగిలిలో బంధించింది. ఈ రొమాంటి సీన్ సోమవారం ఏపీసోడ్ లో హైలైట్ గా నిలిచింది. ఇక శ్రీముఖిని సేవ్ చేసేందుకు బాబా భాస్కర్‌ గెడ్డాన్ని క్లీన్ షేవ్ చేసుకున్నాడు.  శివజ్యోతి కోసం మహేష్ తన జుట్టుకి రంగువేసుకొన్నాడు. బాబా భాస్కర్ కోసం తన షూస్ మొత్తాన్ని ఎరుపు రంగు డబ్బాలో ముంచి త్యాగం చేశాడు రవి. హిమజ కోసం వరుణ్ పెద్ద త్యాగమే చేశాడు. ఏకంగా పేడ ఉన్న టబ్ లో పడుకొన్నాడు.