సైరా డీల్ రూ. 5కోట్లు.. కానీ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమని మోసం చేశారని ఆరోపిస్తున్నారు ఉయ్యాలవాడ వంశస్తులు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి సైరా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. స్వయంగా ఉయ్యాలవాడ వంశీయులతో మాట్లాడారు. వాళ్ల నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. లోకేశన్స్ కోసం వారి సలహాలు తీసుకొన్నారు. ఆ సమయంలోనే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు చేయలేదు. దీంతో ఉయ్యాలవాడ వంశీయులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెగాస్టార్ ఆఫీస్  ముందు నిరసన తెలిపారు కూడా. 

వాస్తవానికి ఉయ్యాలవాడ వారసులు 22 మందికి ఐదు కోట్లు ఇస్తామని సైరా చిత్రబృందం హామీ ఇచ్చిందట.  ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తోంది.  కానీ నేటివరకు తమకు రామ్ చరణ్ న్యాయం చేయలేదని, దీనిపై ఆయన్ను తాము నిలదీశామని, ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు ఒక్కపైసా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.