‘ఎల్లువొచ్చి గోదారమ్మ..ఎల్లకిల్లా పడ్డాదమ్మో.. ‘ మేకింగ్ చూశారా ?


హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే కథానాయిక. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది. తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో నటించారు. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 20న వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా కోసం ఓ రిమిక్స్ సాంగ్ చేశారు. ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..ఎల్లకిల్లా పడ్డాదమ్మో.. ‘ దేవత చిత్రంలో శోభన్ బాబు, శ్రీదేవిపై తెరకెక్కించిన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పుడు ఈ పాటను వాల్మీకి కోసం రీమిక్స్ చేశారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డేలపై అప్పటి పాటలోని ఫీల్ ఎక్కడా మిస్ కాకుండా మరోసారి తెరపై ఆవిష్కరించారు దర్శకుడు హరీష్ శంకర్. 

ఇప్పుడీ సాంగ్ కి సంబంధించిన మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో కీలకమైన బిందెల సెట్ అద్భుతంగా కుదిరింది. ఈ సెట్ ని ప్రముఖ కళా దర్శకుడు అవినాష్ కొల్లా వేశారు. హీరో తన ప్రేయసిని శ్రీదేవిలా ఊహించుకునే సందర్భంలో వచ్చే పాట ఇది. నాటి పాటలోని కాస్ట్యూమ్స్ లాగానే వీళ్ల ఆహార్యం ఉంటుంది.అన్నారు అవినాష్. దేవత రిమిక్స్ సాంగ్ మేకింగ్ ని మీరు చూసేయండీ.. !