‘సైరా’ ట్రైలర్ టాక్


ఉయ్యాలవాడ నరసింహారెడ్దిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సురేంద రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సైరా ట్రైలర్ విడుదలైంది.

భారత మాత జై అంటూ గర్జిస్తున్న మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత నరసింహారెడ్డిని చిత్రహింసలు పెడుతున్న బిట్ సీన్ వస్తూనే.. నరసింహారెడ్డి సామాన్యుడు కాదు. అతడు కారణజన్ముడు. అతడొక యోగి, అతడొక యోధుడు. అతడిని ఎవరు ఆపలేరు అనే వాయిస్ వినిపించింది. ఈ భూమ్మిద పుట్టింది మేము. ఈ మట్టిలో కలిసిపోయేది మేము. మీకెందుకు కట్టాలిరా.. శిస్తు అంటూ నరసింహారెడ్డి ఆంగ్లేయులకి ఎదురుతిరిగిన సీన్ అద్భుతంగా ఉంది.

స్వాతంత్య్రం కోసం జరుగుతున్న తొలి యుద్ధం ఇది. ఈ యుద్ధం నువ్వు గెలవాలని నరసింహారెడ్డి గురువు అమితాబ్ బచ్చన్ చెప్పడం ట్రైలర్ లో చూడొచ్చు. ఆంగ్లేయులతో భీకరుపోరు చూపిస్తూనే.. వారు భారతీయులని ఎలా చిత్రహింసలకి గురిచేశారు. బంధీ అయిన తర్వాత నరసింహారెడ్డి ఏ విధంగా హింసించారు అనే సన్నివేశాలు భాగోద్వేగంగా చూపించారు. మొత్తంగా సైరా ట్రైలర్ అదిరిపోయింది. ఈ రేంజ్ లోనే సినిమా ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కావడం గ్యారెంటీ.