కొత్త అసెంబ్లీ నిర్మాణంపై సుప్రీంకు కేసీఆర్ ?


సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొత్త అసెంబ్లీ భవనాలని అద్భుతంగా నిర్మించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఎంచుకొన్న ఎర్రమంజిల్ భవనాలని కూల్చేందుకు న్యాయ సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఎర్రమంజిల్ భవనాలని కూల్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గురించి సీఎం కేసీఆర్ నిపుణులతో చర్చిస్తున్నారు. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

ఎర్రమంజిల్ భవనాలు వారసత్వ సంపద క్రింద ఉండటం కారణంగానే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాలనే వాడుకోవాలని సూచిస్తోంది. మరోవైపు, ఎర్రమంజిల్ భవనాలు వారసత్వ సంపద క్రింద రావాలని ప్రభుత్వం వాదిస్తోంది. పాత అసెంబ్లీ భవనాలకి వాస్తు దోశం ఉంది. ఆ కారణంగానే వీలైనంత త్వరగా కొత్త అసెంబ్లీ భవనాలని నిర్మించాలనే ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.