దిశా పటానీ సెక్సీ డ్యాన్స్ చూశారా.. ?


‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది దిశా పటానీ. ఆ సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో ఆమెకి మరో అవకాశం రాలేదు. కానీ, ధోని బయోపిక్ తో మరోసారి పటానీ తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. సినిమాల కన్నా లవ్ ఎఫైర్ తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దిశాపటానీ-టైగర్ ష్రాఫ్ ల డేటింగ్ గురించి తెలిసిందే. 

ఇటీవలే దిశా పటానీ తన పేరిట యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ని ఫేమస్ చేసే పనిలో పడింది దిశా. ఇందులో భాగంగా తాజాగా ఓ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది. సెక్సీ డ్యాన్స్ తో పటానీ అదరగొట్టేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఊపేసింది. దిశా అదిరిపోయే డ్యాన్స్ ని మీరు చూసేయండీ.. !