‘వి’ సెట్ లో వెన్నెల కిషోర్ బర్త్ డే సెలబ్రేషన్స్

కమెడియన్ వెన్నెల కిషోర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం వెన్నెల కిషోర్ ‘వి’ సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సుధీర్ బాబు, నాని కథానాయకులుగా నటిస్తున్నారు. ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్ లాండ్ లో జరుగుతోంది. అక్కడే వెన్నెల కిషోర్ బర్త్ డే సెలబ్రేట్ చేసింది చిత్రబృందం.

దానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ పిక్ వైరల్ అవుతోంది.టాలీవుడ్ లో బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ లో నవ్వులు పంచుతున్న కమెడియన్ గా వెన్నెల కిషోర్ పేరు తెచ్చుకొన్నారు. స్టార్, యంగ్ హీరోలు నటిస్తున్న ప్రతి సినిమాలోనూ ఆయన కనిపిస్తున్నారు. తన కామెడీ టైమింగ్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఇలాగే మనల్ని నవ్వించాలని, మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తూ.. వెన్నెల కిషోర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.