ఈ స్పెషల్ పర్సన్ ఎవరంటే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ స్పెషల్ పర్సన్ ని అభిమానులకి పరిచయం చేశారు. అతని పేరు నగర రాము. సౌండ్ రికార్డిస్ట్. రాముతో కలిసి దిగిన లెటెస్ట్ ఫోటోని మహేష్ తన ఇన్ స్ట్రోగ్రామ్ లో షేర్ చేశారు. “నా సౌండ్ రికార్డిస్ట్ నగర రాముని పరిచయం చేస్తున్నా. నా తొలి సినిమా నుంచి పని చేస్తున్నారు. ఇప్పటి వరకు నా సినిమాలు తప్ప బయటి సినిమాలకి చేయలేదు” అని రాసుకొచ్చారు మహేష్.
ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర-దిల్ రాజు-మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Introducing…
My sound recordist Nagara Ramu, as we all fondly call himwho's been with me since my very first film!!! He has never seen another set except mine
Respect and love for always being there for… https://t.co/QsgjytWsS2
— Mahesh Babu (@urstrulyMahesh) September 19, 2019