‘సైరా’ ట్రైలర్ కలెక్షన్ ఎంత ? 


ట్రైలర్ కి కలెక్షన్స్ ఏంటీ అనుకుంటున్నారా ? సినిమాకు మాత్రమే టికెట్స్ తెగుతాయ్. ట్రైలర్ కి టికెట్స్, కలెక్షన్స్ ఉండవు కదా.. ! అది నిజమే. కానీ సైరా ట్రైలర్ కి టికెట్స్ తెగాయ్. ఒక్కో టికెట్ ని రూ. 100కి విక్రయించారు. దాంతో పెద్ద మొత్తంలోనే సైరా ట్రైలర్ కలెక్ట్ చేసినట్టు సమాచారమ్. ఆ ఫిగర్ ఎంత ? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులోనూ సైరా ట్రైలర్ ని థియేటర్స్ లో ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో సైరా ట్రైలర్ ని ఉచితంగానే ప్రదర్శించారు. బెంగళూరులో మాత్రం సైరా ట్రైలర్ టికెట్ ధరని రూ. 100కి విక్రయించారు. ఆ టికెట్స్ కొందరు మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. ట్రైలర్ ని కూడా కమర్షియల్ చేయడం ఏంటన్ని ప్రశ్నించారు. దీనిపై సైరా చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు. 

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్ది జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.